శనివారం పంచాంగం, రాశిఫలాలు (08-05-2021)

by  |
శనివారం పంచాంగం, రాశిఫలాలు (08-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవ నామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ద్వాదశి
(నిన్న సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(నిన్న ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : కౌలవ
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం,, 1 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 9 గం॥ 33 నుంచి ఉదయం 11 గం॥ 18 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 7 గం॥ 28 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 19 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
గుళికకాలం : (తెల్లవారు జాము 5 గం॥ 46 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 22 ని॥ వరకు)
యమగండం : (మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : మీనము

మేష రాశి: వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది స్థిరాస్తుల కొనుగోలుకు ధనము ఖర్చు చేస్తారు. ఇంతకుముందు కొన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నకిలీ స్వామీజీల చేతిలో మోసపోకుండా జాగ్రత్త వహించండి.

వృషభ రాశి : విద్యా సంబంధమైన విషయాలలో పోటీ పరీక్షల సంబంధమైన విషయాలలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా పుంజు కుంటారు. మీ శక్తి కొలది ఇతరులకు సహాయ పడతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్వగృహాన్ని ఏర్పరచుకోవాలని కోరికలకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తారు.

మిధున రాశి: ఆర్థిక పురోగతి బాగుంటుంది. దూరపు బంధువుల నుంచి అందిన బహుమతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు మంచి సమయము ఉన్నత పరీక్షలలో విజయం సాధించే అవకాశం. ఎక్కువగా మాట్లాడి శత్రువులను చేసుకోకుండా తక్కువ మాట్లాడండి. ఈ రాశి ఆడవారికి ముఖ్యముగా స్వయంకృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

కర్కాటక రాశి: మీరు ఇంతకుముందు రుణంగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది. విద్య ఆర్థిక సంబంధిత విషయాలలో అనుకూలమైన సమయము. మీ దగ్గరి వారు మీ ఆలోచనలను అర్థం చేసుకోలేరు. ఇది మీకు అశాంతి నిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది.

సింహరాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. ఇంటిలోని వ్యక్తుల ప్రవర్తన వలన విచారం కలుగుతుంది. వారితో మనసు విప్పి మాట్లాడండి. ఈ రాశి ఆడవారికి కరోనా వల్ల ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా మారుతుంది.

కన్య రాశి: దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు.

తుల రాశి: శుభకార్యాలకు సంబంధించిన విషయాలతో మీకు సంతోషం కలుగుతుంది. విపరీతమైన ఆలోచన మరియు శ్రమ వలన ఆరోగ్యం పాడైపోయే అవకాశం. ఆందోళనలను కట్టిపెట్టి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ రాశి ఆడవారికి మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయడం కూడా సమస్యలకు కారణం అవుతుంది. దూర ప్రాంతాలలో ఉన్న మీ బంధువుల సమాచారం మీకు అందుతుంది. ఆరోగ్య సమస్యలు మిమ్మలను బాధిస్తాయి. స్పెక్యూలేషన్స్ కు దూరంగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి.

ధనుస్సు రాశి: మిమ్ములను మీరు బలంగా నమ్మడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ వచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయి. అతి ముఖ్యమైన విషయాలు రహస్యంగా ఉంచండి. ఈ రాశి స్త్రీలకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

మకర రాశి: కుటుంబ సభ్యుల సహాయంతో మీరు పడుతున్న ఆందోళన దూరం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. భూమి సంబంధమైన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. కరోనా వలన ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రాశి స్త్రీలు మీ మీద ఉన్న బాధ్యతలు సక్రమంగా నెరవేర్చు గలుగుతారు.

కుంభ రాశి: మీరు ఇతరులకు చేసిన సహాయము వలన సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో మీ భాగస్వాములు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఈ రాశి స్త్రీలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది.

మీన రాశి: సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో పరుల చేతిలో వంచన పొందుటకు అవకాశం. డబ్బు ఖర్చు వలన ఆగ్రహం వచ్చే అవకాశం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా ఉద్యోగులు ఓర్పు వహించవలసి ఉంది. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ప్రమోషన్ లభిస్తుంది.


Next Story

Most Viewed