శనివారం పంచాంగం, రాశిఫలాలు (01-05-2021)

102
Panchangam Rasi phalalu

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : పంచమి రా10.17
తదుపరి షష్ఠి
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : మూల మ 3.31
తదుపరి పూర్వాషాఢ
యోగం : శివం ఉ 9.39
తదుపరి సిద్ధం
కరణం : కౌలువ ఉ 11.18
తదుపరి తైతుల రా 10.17
ఆ తదుపరి గరజి
వర్జ్యం : మ 2.00 – 3.31 &
రా 12.40 – 2.11
దుర్ముహూర్తం : ఉ 5.39 – 7.19
అమృతకాలం : ఉ 9.29 – 11.00
రాహుకాలం : ఉ 9.00 – 10.30
యమగండం/కేతుకాలం : మ 1.30 – 3.00
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : ధనుస్సు
సూర్యోదయం : 5.39 || సూర్యాస్తమయం : 6.15

మేషం : ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో ప్రతిష్టంభనలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆర్థిక నష్టాలు తప్పవు.

వృషభం : కీలక సమయంలో జీవితభాగస్వామి సహాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి శత్రువుల నుండి కూడా ఊహించని సహాయాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన ఉద్యోగ యోగం ఉన్నది.

మిధునం : చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయట పడతారు. స్థిరాస్తి వివాదాల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది సంఘంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు.

కర్కాటకం : చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణ సంబంధమైన ఒత్తిడులు పెరుగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.

సింహం : ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు మానసిక సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలవలనఅలసట పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి.

కన్య : సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులుతో వివాదాలు పరిష్కారమవుతాయి.

తుల : నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి కలుగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం : గృహమున శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి లోపలుకుబడిపెరుగుతుంది. స్థిరాస్తివివాదాలలోనూతన ఒప్పందాలుచేసుకుంటారు. చాలా కాలంగా బాధిస్తున్న కుటుంబ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో చక్కగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు.

ధనస్సు : ఇంటా బయట నూతన సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరమైన విషయాలలో మిత్రుల నుండి విమర్శలుకలుగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

మకరం : గృహమున విలువైన వస్తువులను సేకరిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ఆర్థికంగా పురోగతికలుగుతుంది. సోదరులతోవివాదాలుయ తొలగుతాయి నిరుద్యోగులు నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.

కుంభం : కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో లభించిన నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మీనం : సోదరులతో ధన పరమైన వివాదాలు కలుగుతాయి ఆదాయానికిమించిఖర్చులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వ్యాపార విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలుచేసినష్టపోతారు. దూరపుబంధువులను కలుసుకుని కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..