- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టోక్యో ఒలంపిక్స్‌లో మరిన్ని బెర్తులు
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్‌లో ఇప్పటికే స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. దోహాలో జరుగుతున్న ఆసియన్ ఒలంపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో మరి కొందరు ప్యాడ్లర్లు అర్హత సాధించారు. వరల్డ్ నెంబర్ 31 సథియన్ జ్ఞానశేఖరన్ కూడా టీటీ బృందంలో చోటు సంపాదించాడు. మహిళల విభాగంలో వరల్డ్ నెంబర్ 62 మనికా బత్రాను ఓడించడం ద్వారా సుతీర్థ ముఖర్జి టోక్యో బెర్త్ సాధించింది. అయితే వరల్డ్ ర్యాంక్ ప్రకారం […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్‌లో ఇప్పటికే స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. దోహాలో జరుగుతున్న ఆసియన్ ఒలంపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో మరి కొందరు ప్యాడ్లర్లు అర్హత సాధించారు. వరల్డ్ నెంబర్ 31 సథియన్ జ్ఞానశేఖరన్ కూడా టీటీ బృందంలో చోటు సంపాదించాడు. మహిళల విభాగంలో వరల్డ్ నెంబర్ 62 మనికా బత్రాను ఓడించడం ద్వారా సుతీర్థ ముఖర్జి టోక్యో బెర్త్ సాధించింది. అయితే వరల్డ్ ర్యాంక్ ప్రకారం మనికాకు కూడా ఒలంపిక్స్ బెర్త్ దొరికే అవకాశం ఉన్నది. దోహాలో జరుగుతున్న క్యాలిఫికేషన్లు అన్నింటినీ ఇండియన్ టీటీ ఫెడరేషన్ ఏప్రిల్‌లో సమీక్షించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
Next Story






