- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటరి మహిళపై సర్పంచ్ భర్త కన్ను.. మూడు నెలలుగా అదే పని
<p>దిశ, సిద్దిపేట: మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మైసంపల్లికి చెందిన బ్యాదరబోయన నాగరాణి అనే వివాహిత.. తన భర్త రమేష్ చనిపోతే భర్త డెత్ సర్టిఫికెట్ కోసం గ్రామ పంచాయితీ సెక్రటరీని ఆశ్రయించింది. అప్పటికే డెత్ సర్టిఫికెట్ సర్పంచ్ భర్త గందమల్ల రాజ ఎల్లయ్య తనవద్ద పెట్టుకున్నాడు. నా భర్త డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాజ ఎల్లయ్యను నిలదీయగా తన […]</p>

దిశ, సిద్దిపేట: మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మైసంపల్లికి చెందిన బ్యాదరబోయన నాగరాణి అనే వివాహిత.. తన భర్త రమేష్ చనిపోతే భర్త డెత్ సర్టిఫికెట్ కోసం గ్రామ పంచాయితీ సెక్రటరీని ఆశ్రయించింది. అప్పటికే డెత్ సర్టిఫికెట్ సర్పంచ్ భర్త గందమల్ల రాజ ఎల్లయ్య తనవద్ద పెట్టుకున్నాడు. నా భర్త డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాజ ఎల్లయ్యను నిలదీయగా తన కోరిక తీరుస్తే ఇస్తానని చెప్పాడని బాధితురాలు వాపోయింది. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తా, నీకు అన్నీ రకాలుగా తోడుంటానని నేను చెప్పినట్టు వినాలని వేధింపులకు గురి చేసాడని నాగరాణి ఆరోపించింది.
గత మూడు నెలల నుంచి తనకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై బాధిత మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయిస్తే తనకు న్యాయం చేయకుండా తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని కన్నీరుమున్నీరు అయ్యింది. తాను ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ను సంప్రదించగా.. వారి ఆదేశాల మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని పోలీసుల తీరుపై మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు జరిగిన బాధను మీడియాతో వెల్లడించి కన్నీరు మున్నీరుగా విలపించింది.
- Tags
- alone woman






