- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ వాహనంతో సర్పంచ్ వ్యాపారం
<p>దిశ, తుంగతుర్తి: తన సొంత పనుల కోసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించుకున్నాడు ఓ ప్రజాప్రతినిధి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వైకుంఠధామం, డంప్ యార్డ్, రైతు వేదికల నిర్మాణం కోసం కావాల్సిన ఇసుకను మండల తహశీల్దార్ పర్మిషన్, వే బిల్‌తో కూడిన పత్రాలను తీసుకుని, ప్రతి ట్రాక్టర్‌కు రెవెన్యూ అధికారులు నియమించి అధికారికంగా తరలిస్తారు. కానీ ఉట్కూర్ గ్రామ సర్పంచ్ […]</p>

దిశ, తుంగతుర్తి: తన సొంత పనుల కోసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించుకున్నాడు ఓ ప్రజాప్రతినిధి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. వైకుంఠధామం, డంప్ యార్డ్, రైతు వేదికల నిర్మాణం కోసం కావాల్సిన ఇసుకను మండల తహశీల్దార్ పర్మిషన్, వే బిల్‌తో కూడిన పత్రాలను తీసుకుని, ప్రతి ట్రాక్టర్‌కు రెవెన్యూ అధికారులు నియమించి అధికారికంగా తరలిస్తారు. కానీ ఉట్కూర్ గ్రామ సర్పంచ్ తహశీల్దార్ నుంచి ఎలాంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా, అక్రమంగా గ్రామపంచాయతీ ట్రాక్టర్లో తరలించినట్లు సమాచారం. మరోవైపు గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను మైనర్ పిల్లలకు అప్పజెప్పి వారితో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో నింపి గ్రామానికి తరలించిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. దీనిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.






