నిఘా నీడలో ఆ గ్రామం

by  |
నిఘా నీడలో ఆ గ్రామం
X

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని చిన్న గ్రామ పంచాయతీల్లో పొల్కంపల్లి ఒకటి. శాంతి భద్రతలకు పెట్టింది పేరు. రెండేళ్లుగా పోలీస్​స్టేషన్​ మెట్లెక్కని గ్రామం. గ్రామస్తులంతా ఒకే తాటిపై ఉంటూ అభివృద్ధే ఆకాంక్షగా సర్పంచ్ కు సహకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామంలో 780 జనాభా, 500 ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ ​సొంత డబ్బులు, గ్రామస్తుల సహకారంతో ఊరంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో దొంగతనాలు తగ్గడంతోపాటు కొత్తవారి కదలికలను గుర్తించడం ఈజీగా మారింది. సర్పంచ్​ నిర్ణయానికి ఎమ్మెల్యే, ఎస్పీ కితాబిచ్చారు.

దిశ, పరిగి: పరిగికి పది కిలోమీటర్ల దురంలో ఉన్న చిన్న పంచాయతీ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తోటి సర్పంచ్​లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పొల్కంపల్లి సర్పంచ్ కే మధుసూదన్​రెడ్డి తన సొంత నిధులు, వార్డు మెంబర్లు, గ్రామస్తుల వద్ద సేకరించిన రూ.లక్షతో ఊరంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని వచ్చే అన్ని రోడ్లు, ఊరంతా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలు బిగించారు. దొంగతనంతోపాటు గ్రామానికి ఎవరు కొత్తగా వస్తున్నారని, గ్రామస్తులు పొలాలకు వెళ్లినా ఊరంతా నిఘా నీడలో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ సర్పంచ్ మధుసూదన్​రెడ్డిని అభినందించారు. రెండే ళ్లుగా ఊరంతా పోలీస్​ స్టేషన్​మెట్లెక్కలేదని తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు.

అభివృద్ధిలోనూ ఆదర్శమే..

రెండేళ్లుగా సర్పంచ్ రూ.60 లక్షలతో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు నిర్మించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాడు. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల పనులు కూడా చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాడు.

ఓ ఘటనతోనే ఈ నిర్ణయం..

గ్రామంలో ఓ రోజు మూఢనమ్మకాల సంఘట భయబ్రాంతులకు గురించేసింది. దీంతో గ్రామం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకున్నా. నా సొంతం , పెద్దల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు డబ్బులు సమకూరాయి. వెంటనే సీసీ కెమెరాలు బిగించి గ్రామాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు న్నా. ఎమ్మెల్యే, ఎంపీపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నా.

‌‌–మధుసూదన్​రెడ్డి, పొల్కంపల్లి గ్రామ సర్పంచ్


Next Story

Most Viewed