ఆడపిల్ల పుడితే ఫ్రీగా రూ. 10వేలు.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?

by  |
ఆడపిల్ల పుడితే ఫ్రీగా రూ. 10వేలు.. తెలంగాణలో ఎక్కడో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడపిల్ల అంటే ఇంటికి దీపం. ఆడపిల్ల పుట్టింది అంటే చాలు ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటారు. కానీ, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే భారంగా భావించే వారు ఉన్నారు. అయితే ఇలా ఆడపిల్లలను భారంగా భావించే వారికి ఆ గ్రామ సర్పంచ్ భరోసా ఇస్తున్నాడు. ఎక్కడైనా సర్పంచ్ అంటే ఊరిబాగోగులు చూసుకొని వచ్చిన నిధులతో గ్రామంలోని పనులు చూసి సైలెంట్‌గా ఉంటారు. కానీ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ మాత్రం తన ధాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. తన సొంత డబ్బులతో ఊరి సమస్యలను తీర్చడమే కాకుండా, ఆడపిల్ల పుట్టిన వారికి తన వంతు సహాయంగా రూ. 10,000 అందిస్తున్నాడు. ఇంతకీ ఆ గ్రామం పేరు ఎంటీ అనుకుంటున్నారా..?

జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామం. ఈ గ్రామం దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిచింది. అయితే ఈ ఊరి సర్పంచ్ అల్లం బాలిరెడ్డి నిర్మల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో ప్రతి సమస్యను త్వరగా పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే తన గ్రామంలో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.10వేల కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీన్ని సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరిట బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు. అంతే కాకుండా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 20న తల్లిదండ్రులకు డిపాజిట్‌ పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని వారందరికీ కూడా డబ్బులు అందజేయనున్నట్టు తెలిపారు. దీంతో గ్రామంలో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆనదంలో మునిగిపోయారు. గ్రామంలోని వారే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా సర్పంచ్‌ను అభినందిస్తున్నారు.


Next Story

Most Viewed