- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకొని సర్పంచ్ ఆత్మహత్య
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలంలో విషాదం చోటుచేసుకుంది. మావినేల్లి సర్పంచ్ చంద్రప్ప(48) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చంద్రప్ప కుటుంబ సభ్యులు సాయంత్రం గ్రామంలోని చెన్నబసవేశ్వర ఆలయంలో జరిగిన బసవ జయంతి పూజా కార్యక్రమానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆలయం నుంచి రాగానే ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించారు. దీంతో […]</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలంలో విషాదం చోటుచేసుకుంది. మావినేల్లి సర్పంచ్ చంద్రప్ప(48) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చంద్రప్ప కుటుంబ సభ్యులు సాయంత్రం గ్రామంలోని చెన్నబసవేశ్వర ఆలయంలో జరిగిన బసవ జయంతి పూజా కార్యక్రమానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆలయం నుంచి రాగానే ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించారు. దీంతో కుటుంబంలో విషాదచాయలు అల్లుముకున్నాయి. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags : Sarpanch, suicide, medak, sangareddy, basava jayanthi puja
Next Story






