- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరపైకి ‘సరోజ్ జీ’ బయోపిక్
<p>బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి.. ఇండియన్ సినిమాకు తీరని లోటని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువుగా ఆమె నేర్పిన పాఠాలు తమ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. డ్యాన్స్ ఉన్నంత వరకు తను బ్రతికే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. కాగా, ‘సరోజ్ జీ’ జీవితకథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది తన కుమార్తె సుకైనా నాగ్‌పాల్. సరోజ్ జీ బయోపిక్ తీయాలని చాలా మంది తనను […]</p>

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి.. ఇండియన్ సినిమాకు తీరని లోటని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువుగా ఆమె నేర్పిన పాఠాలు తమ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. డ్యాన్స్ ఉన్నంత వరకు తను బ్రతికే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు.
కాగా, ‘సరోజ్ జీ’ జీవితకథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది తన కుమార్తె సుకైనా నాగ్‌పాల్. సరోజ్ జీ బయోపిక్ తీయాలని చాలా మంది తనను సంప్రదించారని తెలిపిన ఆమె.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా తొలుత ఈ ప్రపోజల్‌ను తన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపింది. అమ్మను ఇంతకు ముందు ఈ విషయం గురించి అడిగినప్పుడు కూడా తన బయోపిక్ రెమో డిసౌజా తెరకెక్కిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించింది. చాలా కష్టపడి.. సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన రెమో డిసౌజా పట్ల అమ్మకు అభిమానం ఎక్కువగా ఉండేదని తెలిపింది సరోజ్ జీ తనయ.






