- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్ఫరాజ్‌ను తప్పించడం సరికాదు: ఇంజమామ్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ జట్టుకు అవసరమైన సమయంలోనే సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తప్పించారని, అతని సేవలు మరికొంత కాలం ఉపయోగించుకోవాల్సి ఉందని పాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. పాక్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన సర్ఫరాజ్‌ను కేవలం వరల్డ్ కప్ వైఫల్యాల నెపాన్ని ఆపాదించి తొలగించడం భావ్యం కాదని ఆయన అన్నారు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు టీ20లో నెంబర్ వన్ జట్టుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ […]</p>

X
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ జట్టుకు అవసరమైన సమయంలోనే సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తప్పించారని, అతని సేవలు మరికొంత కాలం ఉపయోగించుకోవాల్సి ఉందని పాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. పాక్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన సర్ఫరాజ్‌ను కేవలం వరల్డ్ కప్ వైఫల్యాల నెపాన్ని ఆపాదించి తొలగించడం భావ్యం కాదని ఆయన అన్నారు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు టీ20లో నెంబర్ వన్ జట్టుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా ఉండటానికి అన్ని అర్హతలు సర్ఫరాజ్‌కు ఉన్నాయని, అతడిని మరికొన్ని రోజులు కెప్టెన్‌గా కొనసాగించాల్సిందని ఇంజమామ్ అన్నారు.
Next Story






