ఊపేస్తున్న ‘సారంగదరియా’.. నెమలిని తలపిస్తున్న ఫిదా బ్యూటీ

149

దిశ, సినిమా : సహజత్వం నిండిన పాత్రలతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తూ, సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘లవ్‌స్టోరి’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ సాధించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఫోక్ స్టైల్‌లో సాగే ‘సారంగదరియా’ సాంగ్ రిలీజైంది. మాస్ బీట్.. అదిరిపోయే లిరిక్స్.. సాయి పల్లవి ఎక్స్‌ప్రెసివ్ డ్యాన్స్ ఈ పాటను మరో లెవెల్‌లో నిలబెట్టాయి.

ఇక ఈ పాట లిరికల్‌ వీడియోను చార్మింగ్ బ్యూటీ సమంత విడుదల చేయగా, సుద్దాల అశోక్‌ తేజ పల్లెపదాలతో అందించిన సాహిత్యం పరవశించేలా ఉంది. సింగర్ మంగ్లీ తన పెక్యులర్ వాయిస్‌తో మెస్మరైజ్ చేయగా.. పాటలోని గజ్జెల సప్పుడు, డప్పుల మోతకు సాయి పల్లవి డ్యాన్సింగ్ మూవ్స్ పురివిప్పిన నెమలిని తలపించాయి. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ అందించిన ఈ జానపదం ప్రేక్షకులకు ఊపునిస్తుండగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈలలు పెట్టిస్తోంది. కాగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..