ఆయన షాజహాన్‌ కాదు : సారా అలీఖాన్

by  |
ఆయన షాజహాన్‌ కాదు : సారా అలీఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ కుమార్, తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ కలిసి ‘అత్రంగి రే’ మూవీ కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఢిల్లీలో 15 రోజుల పాటు జరగనుండగా.. ప్రేమకు చిహ్నంగా నిలిచే ‘తాజ్‌మహల్’ ముందు ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో రాజుల కాలం నాటి కాస్ట్యూమ్స్ ధరించి, చేతిలో ఓ పువ్వు పట్టుకుని ఉన్న కామెడీ కింగ్ అక్షయ్ కుమార్.. తాజ్‌మహల్ ముందు గింగిరాలు తిరుగుతూ పరవశించిపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘వాహ్ తాజ్’ అని కామెంట్ చేయగా, ‘ఇంతకంటే గొప్ప రంగుల్ని మీరు చూడలేరు.. ఆయన షాజహాన్ కాదు.. మిస్టర్ కుమార్’ అంటూ బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ అక్షయ్ కుమార్ ‘అత్రంగి రే’లోని ఎపిక్ పిక్‌ను షేర్ చేసింది.

ఓ రంగుల బగ్గీలో షాజహాన్‌ను తలపించే విధంగా ఉన్న అక్షయ్ ఫొటో ఫ్యాన్స్‌కు నిజంగానే విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అక్షయ్‌కు ఇది 130వ సినిమా కాగా, సారా అలీ ఖాన్ డబుల్ రోల్‌లో కనిపించబోతుందని టాక్. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ‘అత్రంగి రే’ మూవీని 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.



Next Story

Most Viewed