- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ఎంగేజ్‌మెంట్‌లో మాజీ భార్య డ్యాన్స్..
<p>దిశ, సినిమా : బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ ‘అత్రంగి రే’ నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హాయ్ చకా చక్ హే తూ’ పాటలో సారా అలీఖాన్ గ్రీన్ శారీలో బ్యూటిఫుల్‌గా కనిపించగా.. సినిమాలో సారా భర్త ధనుష్‌కు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తెరకెక్కించారు. సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌లో సాగే పాటలో సారా లుక్స్, డ్యాన్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటకు యుగభారతి లిరిక్స్ […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ ‘అత్రంగి రే’ నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘హాయ్ చకా చక్ హే తూ’ పాటలో సారా అలీఖాన్ గ్రీన్ శారీలో బ్యూటిఫుల్‌గా కనిపించగా.. సినిమాలో సారా భర్త ధనుష్‌కు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తెరకెక్కించారు. సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌లో సాగే పాటలో సారా లుక్స్, డ్యాన్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటకు యుగభారతి లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ ఆలపించింది.
ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సారా.. ‘బిహార్ కి చోరీ కా నిక్లా గానా.. అబ్ హర్ షాదీ పర్ యహీ బజానా.. గ్యారెంటీ మజా ఆనా’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో టి-సిరీస్, ఆనంద్ ఎల్ రాయ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఎ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అత్రంగి రే’ చిత్రంలో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.






