- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను చేసిన తప్పు అదే: సంజయ్ ఝా
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు ఉద్వాసన పలకడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. ఝాను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం లెటర్ పంపింది. దీనిపై స్పందిస్తూ సంజయ్ ఝా తీవ్ర విమర్శలు చేశారు. తన విధేయత కాంగ్రెస్ భావజాలానికేనని గానీ, మరే వ్యక్తికో, కుటుంబానికో కాదని స్పష్టం చేశారు. గాంధీ-నెహ్రూవియన్ ఆదర్శాలనే పాటిస్తానని, ఈ ఆదర్శాలు ప్రస్తుతం పార్టీలో కనుమరుగవుతున్నాయని తెలిపారు. పార్టీ మళ్లీ పునరుత్తేజం గావించడానికి తాను పోరాడుతూనే ఉంటారని […]</p>

X
న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు ఉద్వాసన పలకడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. ఝాను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం లెటర్ పంపింది. దీనిపై స్పందిస్తూ సంజయ్ ఝా తీవ్ర విమర్శలు చేశారు. తన విధేయత కాంగ్రెస్ భావజాలానికేనని గానీ, మరే వ్యక్తికో, కుటుంబానికో కాదని స్పష్టం చేశారు. గాంధీ-నెహ్రూవియన్ ఆదర్శాలనే పాటిస్తానని, ఈ ఆదర్శాలు ప్రస్తుతం పార్టీలో కనుమరుగవుతున్నాయని తెలిపారు. పార్టీ మళ్లీ పునరుత్తేజం గావించడానికి తాను పోరాడుతూనే ఉంటారని వివరించారు. ఈ పోరాటం ఇప్పుడే మొదలైందని పేర్కొన్నారు. అంతేకాదు, తనలో కాంగ్రెస్సీ డీఎన్ఏ ఉన్నదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాడటం, పార్టీని సంస్కరించడానికి రిప్‌వాన్ వింకిల్ నాయకత్వానికి సలహాలివ్వడమే తాను చేసిన తప్పులని వ్యగ్యంగా తన ట్విట్టర్ బయోలో రాసుకున్నారు.
Next Story






