బన్నీ.. ఒక్క చాన్స్ అంటున్న బాలీవుడ్ డైరెక్టర్!

by  |
బన్నీ.. ఒక్క చాన్స్ అంటున్న బాలీవుడ్ డైరెక్టర్!
X

‘అల వైకుంఠపురంలో’ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్‌తో మరింత స్టైలిష్‌గా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు ఎంతో మంది సెలబ్రిటీలు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వగా.. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ గుప్తా.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ఆణిముత్యంగా అభివర్ణించారు. స్వచ్ఛమైన కల్తీలేని వినోదాత్మక చిత్రమని ప్రశంసించారు. ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూడలేకపోయినందుకు ఫీల్ అవుతున్నట్లు ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన బన్నీ.. ఆయనకు థాంక్స్ చెప్పడంతో పాటు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. బన్నీ మెసేజ్‌కు రిప్లయ్ ఇచ్చిన సంజయ్ గుప్తా.. ‘బ్రదర్ మీ పర్ఫార్మెన్స్ చూసి పూర్తిగా ఫిదా అయిపోయాను. మీ నటనతో నన్ను నవ్వించారు, ఏడిపించారు. నేను ఇప్పుడు మీ ఫ్యాన్ బాయ్. మీతో కలిసి పనిచేసే అవకాశం కోసం వెయిట్ చేయలేకపోతున్నా’ అన్నారు.

కాగా బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే ఖచ్చితంగా చేస్తానన్న బన్నీ.. సంజయ్ గుప్తా మాటను సీరియస్‌గా తీసుకుంటారా? బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా? అనే చర్చ జరుగుతుండటం విశేషం.

https://twitter.com/_SanjayGupta/status/1281953384535212034?s=19

Next Story

Most Viewed