క్యాన్సర్‌ను జయించిన సంజూ భాయ్..

by  |
క్యాన్సర్‌ను జయించిన సంజూ భాయ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్‌ను జయించారు. ఈ విషయాన్ని తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. బర్త్ డే సందర్భంగా వారికిచ్చే గొప్ప బహుమతి ఇదేనని తెలిపారు సంజయ్. ‘మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు అంటూ’ ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కొన్ని వారాలుగా నేను, ఫ్యామిలీ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని.. మీ నమ్మకం, ప్రేమ, సపోర్ట్ వల్ల ఇందులో నుంచి బయటపడ్డామని చెప్పారు. కష్ట సమయంలో నాతోపాటు నిలబడిన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేమ, దయ, ఆశీర్వచనాలు అందించిన అందరికీ థాంక్స్ చెప్పారు సంజయ్ దత్. కోకిలాబెన్ ఆస్పత్రిలో తనకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ సేవంతి అండ్ టీమ్, నర్సులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. కొన్ని వారాల పాటు తనను చాలా జాగ్రత్తగా చూసుకుని.. క్యాన్సర్‌ను జయించేలా చేసినందుకు రుణపడి ఉంటానని తెలిపారు.

నువ్వు నిజమైన ఫైటర్ సంజూ భాయ్ అంటున్న ఫ్యాన్స్.. 2020లో ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూస్ ఇదే అని చెప్తున్నారు. సంజయ్‌కు క్యాన్సర్ అనే వార్తతో బాధపడ్డ ఫ్యాన్స్.. ఇప్పుడు ఆనందంతో ఉన్నామని చెప్తున్నారు.

https://twitter.com/duttsanjay/status/1318844135348948993?s=19

Next Story

Most Viewed