ఫ్యాన్ మూమెంట్‌తో సంజన సూపర్ హ్యాపీ

82

దిశ, వెబ్ డెస్క్: “దిల్ బెచారా” హీరోయిన్ సంజనా సంఘీ మేజర్ ఫ్యాన్ మూమెంట్‌తో సూపర్ హ్యాపీగా ఉంది. ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ పుస్తకం ఆధారంగా ‘దిల్ బెచారా’ సినిమా తెరకెక్కగా..ఆ పుస్తక రచయిత జాన్ గ్రీన్ అప్రిసియేషన్ నోట్ అందుకున్న సంజన ఆనందంగా ఉంది. ఈ సినిమా జూలై 24 రిలీజ్ కాగా, చిత్రం చూసిన జాన్ గ్రీన్ కాంప్లిమెంట్స్ అందించారు. సినిమా చూసిన నెక్స్ట్ డే అప్రిసియేషన్ అందినా..తను మూడు నెలల తర్వాత ఈ బ్యూటిఫుల్ మెసేజ్ చూసుకున్నట్లు తెలిపింది.

సంజన..దిల్ బెచారా సినిమా చూసి నిజంగా ఆనందించాను అని తెలిపాడు జాన్ గ్రీన్. మీ నటన చాలా అద్భుతంగా ఉంది. హాస్యం, లోతైన భావోద్వేగ సన్నివేశాలు చూసి హృదయం నిండిపోయిందని తెలిపారు. కిజీ పాత్రకు ఇంత గొప్ప లైఫ్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పాడు. మీ కో స్టార్ మరణం మిమ్మల్ని ఎంత బాధించింది ఊహించగలను అన్న జాన్..చలన చిత్రానికి ప్రాణం పోసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జాన్.

జాన్ గ్రీన్ మెసేజ్‌తో సూపర్ హ్యాపీగా ఉన్న సంజన.. కిజీ పాత్రలో ఉన్న భావోద్వేగాలను న్యాయం చేశానని మీరు గుర్తించినందుకు నా హృదయం ఆనందంతో నిండి పోయిందని తెలిపింది. మీకు ఎప్పటికీ రుణపడి ఉండే మీ అభిమాని అంటూ రిప్లై ఇచ్చింది.