మాలీవుడ్ హీరోయిన్ న్యూ బిజినెస్

by  |
మాలీవుడ్ హీరోయిన్ న్యూ బిజినెస్
X

మాలీవుడ్ నటి సానియా అయ్యప్పన్ అందంతో పాటు తెలివైన అమ్మాయిగా గుర్తింపు పొందింది. క్వీన్, లూసిఫర్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ పద్దెనిమిదేండ్ల చిన్నది.. ఫ్యాషన్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను ధరించే దుస్తులు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాయి. ఈ విషయమై పలువురి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది.

ఈ ఇంట్రస్టే తనను వ్యాపారం వైపు అడుగులేసేలా చేసింది. సానియాస్ సిగ్నేచర్ పేరుతో క్లాత్ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తన సరికొత్త జర్నీలో భాగం కావాలని కోరింది. ఫ్యాషన్‌ను ప్రేమించే వారికి సానియాస్ సిగ్నేచర్ అల్టిమేట్ డెస్టినేషన్‌గా నిలుస్తుందని చెప్పింది. త్వరలోనే సీజనల్ కలెక్షన్ పరిచయం చేస్తామని తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్న మాలీవుడ్ స్టార్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవాలని బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.



Next Story

Most Viewed