- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు జాగిలం మృతి.. 9 ఏండ్లలో 30 కేసుల ఛేదన
<p>దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రాకర్ డాగ్‌గా ఎంపికై దొంగతనాలు, మర్డర్ వంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో చురుకుగా వ్యవహరించి, అధికారుల మన్నలను పొందిన మార్షల్ అనే జర్మన్ శపథ జాతికి చెందిన పోలీసు జాగిలం అనారోగ్యంతో మృతిచెందింది. జాగిలం మృతిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తన సంతాపాన్ని తెలిపారు. మార్షల్ 06 అక్టోబర్ 2011 లో జన్మించింది. నేరానికి పాల్పడి, నేరస్థలం నుంచి పారిపోయిన నేరస్తులను వెంబడించి గుర్తించడంలో కఠిన […]</p>

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రాకర్ డాగ్‌గా ఎంపికై దొంగతనాలు, మర్డర్ వంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో చురుకుగా వ్యవహరించి, అధికారుల మన్నలను పొందిన మార్షల్ అనే జర్మన్ శపథ జాతికి చెందిన పోలీసు జాగిలం అనారోగ్యంతో మృతిచెందింది. జాగిలం మృతిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తన సంతాపాన్ని తెలిపారు. మార్షల్ 06 అక్టోబర్ 2011 లో జన్మించింది. నేరానికి పాల్పడి, నేరస్థలం నుంచి పారిపోయిన నేరస్తులను వెంబడించి గుర్తించడంలో కఠిన శిక్షణ పొందిన అనంతరం మొదట ఉమ్మడి మెదక్ జిల్లాలో విధులు నిర్వహించి, జిల్లాల విభజన అనంతరం సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తూ వచ్చింది. మార్షల్ తన 9 సంవత్సరాల సర్వీస్‌లో 30 కేసులలో నేరస్తులను గుర్తించి అధికారుల మన్నలను పొందడం జరిగిందని డాగ్ హాండ్లర్ బసవరాజ్ తెలిపారు. అంత్యక్రియలకు ఆర్ఏలు హరిలాల్, డానియల్, కృష్ణ, ఆర్ఎస్ఎ హనుమంత్ రెడ్డి, డాగ్ హ్యాండ్లెర్స్ యాదవ్ రావ్, జగదీశ్వర్, హనుమంతు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






