సెలబ్రేషన్స్ అలర్ట్: సందీప్ కిషన్ స్పెషల్ అనౌన్స్‌మెంట్

by  |
సెలబ్రేషన్స్ అలర్ట్: సందీప్ కిషన్ స్పెషల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయింది. టాలీవుడ్‌లో ఫస్ట్ హాకీ బేస్డ్ సినిమాగా వస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ను మార్చి 5న థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. జీవన్ కనుకొలను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుండగా.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌లో 8.5 మిలియన్ వ్యూస్‌ సాధించి సందీప్ కెరియర్‌లోనే అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో రావు రమేష్, పోసాని, మురళీ శర్మ, ప్రియదర్శి, సత్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న చిత్రానికి కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్.


Next Story

Most Viewed