- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు మస్కా కొట్టిన స్మగ్లర్లు
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఇసుక స్మగ్లర్‌లు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి మండలంలోని బరం గెడిగి వాగు నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇందులో రెండు ట్రాక్టర్లను స్మగ్లర్లు రాత్రికి రాత్రే పోలీసులకు మస్కా కొట్టి విడిపించుకుపోవడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇసుక అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నాయకుడి పేరు […]</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఇసుక స్మగ్లర్‌లు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి మండలంలోని బరం గెడిగి వాగు నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇందులో రెండు ట్రాక్టర్లను స్మగ్లర్లు రాత్రికి రాత్రే పోలీసులకు మస్కా కొట్టి విడిపించుకుపోవడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇసుక అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నాయకుడి పేరు చెప్పి ట్రాక్టర్లు విడిపించుకుపోవడం పై పెద్ద ఎత్తున దూమారం రేపింది. ఇసుక మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పూర్తి స్థాయిలో కట్టడి చేయడం లేదని.. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
Next Story






