ఐసీసీ బ్యాన్ తర్వాత కోచ్ అవతారం ఎత్తనున్న జయసూర్య

by  |
ఐసీసీ బ్యాన్ తర్వాత కోచ్ అవతారం ఎత్తనున్న జయసూర్య
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ప్రస్తుతం ఐసీసీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నాడు. క్రికెట్‌లో అవినీతికి సంబంధించిన ఒక కేసులో ఐసీసీ ముందు హాజరు కావడానికి నిరాకరించడంతో 2019 ఫిబ్రవరిలో అతడిపై రెండేళ్ల బ్యాన్ విధించారు. కాగా, ఐసీసీ బ్యాన్ ముగిసినా సనత్ జయసూర్య క్రికెట్‌తో ఎలాంటి సంబంధాలు లేకుండా దూరంగా ఉన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై జయసూర్య అసంతృప్తిగా ఉండటం వల్లే ఆటకు దూరమైనట్లు తెలుస్తున్నది. కాగా, శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ కోరిక మేరకు ఆయన మెల్‌బోర్న్‌కు చెందిన మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్‌లో కోచ్‌గా జాయిన్ అవడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ‘హెరాల్డ్ సన్’ అనే పత్రిక కథనం ప్రచురించింది.

‘దిల్షాన్ కారణంగా మాకు సనత్ జయసూర్య కోచ్‌గా రావడానికి ఒప్పుకున్నాడు. ఆయన మా క్లబ్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో గర్వకారణం’ అని మల్‌గ్రేవ్ క్లబ్ అధ్యక్షుడు మలిన్ పేర్కొన్నారు. మల్‌గ్రేవ్ క్లబ్ తరపున తిలకరత్నె దిల్షాన్‌తోపాటు ఉపుల్ తరంగ కూడా క్రికెట్ ఆడుతున్నాడు.


Next Story