- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమి పంచాయితీ.. వ్యక్తి కుల బహిష్కరణ!
<p>దిశ, దుబ్బాక : మమ్మల్ని కుల బహిష్కరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి గ్రామానికి చెందిన సాన కిష్టయ్య అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన సాన కిష్టయ్య తన భూమి విషయంలో కుల పెద్దలు గత నాలుగు నెలలుగా వేధించడంతో పాటు కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపించారు. కులానికి సంబంధించిన వారు ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని తెలపడంతో కులస్తులు ఎవరు తమతో మాట్లాడకుండా చేసి మానసికంగా […]</p>

దిశ, దుబ్బాక : మమ్మల్ని కుల బహిష్కరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి గ్రామానికి చెందిన సాన కిష్టయ్య అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన సాన కిష్టయ్య తన భూమి విషయంలో కుల పెద్దలు గత నాలుగు నెలలుగా వేధించడంతో పాటు కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపించారు.
కులానికి సంబంధించిన వారు ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని తెలపడంతో కులస్తులు ఎవరు తమతో మాట్లాడకుండా చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. భూమి విషయంలో కోర్టుకు వెళ్తానని చెప్పడంతో ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి, కుల బహిష్కరణ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కుల బహిష్కరణకు సంబంధించిన వీడియో, ఆడియోలు ఉన్నాయని తమ కుటుంబానికి న్యాయం జరగకపోతే హెచ్ఐర్సీకి ఫిర్యాదు చేయనున్నట్లు మీడియాకు వెల్లడించారు.






