- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలండ్ అబ్బాయి.. ఢిల్లీ కుర్రాడు.. దేశీ స్టైల్‌లో ఒక్కటైన గే కపుల్!
<p>దిశ, ఫీచర్స్ : ఢిల్లీకి చెందిన గౌరవ్ అరోరా(గ్యారీ), పోలండ్ వాసి ప్రెజ్‌మేక్ పావ్(ప్రణయ్).. విభిన్న ప్రేమకథతో ఒక్కటైన గే కపుల్. డేటింగ్ యాప్‌లో మొదలైన వీరి పరిచయం, ఫస్ట్ డేట్ తర్వాత బలపడింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని హౌజ్ ఖాస్ గ్రామంలో మొదటిసారి కలుసుకున్నారు. ఈ ప్రయాణంలోనే ఒకరికొకరు ప్రేమలో పడటంతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రపంచంతో పోరాడాల్సి వచ్చింది. చివరకు సరిహద్దులు దాటి ఒక్కటై తమ ప్రేమను నిలబెట్టుకున్నారు. ‘డేటింగ్ యాప్‌లో గ్యారీ […]</p>

దిశ, ఫీచర్స్ : ఢిల్లీకి చెందిన గౌరవ్ అరోరా(గ్యారీ), పోలండ్ వాసి ప్రెజ్‌మేక్ పావ్(ప్రణయ్).. విభిన్న ప్రేమకథతో ఒక్కటైన గే కపుల్. డేటింగ్ యాప్‌లో మొదలైన వీరి పరిచయం, ఫస్ట్ డేట్ తర్వాత బలపడింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని హౌజ్ ఖాస్ గ్రామంలో మొదటిసారి కలుసుకున్నారు. ఈ ప్రయాణంలోనే ఒకరికొకరు ప్రేమలో పడటంతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రపంచంతో పోరాడాల్సి వచ్చింది. చివరకు సరిహద్దులు దాటి ఒక్కటై తమ ప్రేమను నిలబెట్టుకున్నారు.

‘డేటింగ్ యాప్‌లో గ్యారీ ప్రొఫైల్‌ను చూసి అట్రాక్ట్ అయ్యాను. ఇంచుమించు తనది కూడా అదే ఫీలింగ్ కాగా, వీలైనంత త్వరగా కలిస్తే బాగుండని ఇద్దరం అనుకున్నాం. ఆ తర్వాత పోలండ్ నుంచి ఢిల్లీకి చేరుకుని గ్యారీని కలిశా. అలా పదిరోజుల పాటు ఎంతో ఆనందంగా గడిపాం. అయితే నేను తిరిగి పోలండ్ వెళ్లే సమయంలో.. క్రిస్మస్ ఫెస్టివల్‌కు తమ దేశానికి రావాలని, మా కుటుంబాన్ని కలవాలని గ్యారీని ఆహ్వానించాను’ అని ప్రణయ్ అన్నారు.

ఇక గ్యారీ క్రిస్మస్ వేడకల కోసం పోలండ్ వెళ్లిన తర్వాత తమ మనుసులోని మాటను ప్రణయ్ ఫ్యామిలీకి తెలపడంతో ఇరు కుటుంబాలు వారి సంబంధానికి మద్దతునిచ్చాయి. ఈ క్రమంలో పోలండ్‌లోనే నాలుగేళ్లున్న తర్వాత ఆమ్‌స్టర్‌డామ్‌కు మారారు. ఫైనల్‌గా ఓ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రణయ్ గ్యారీకి ప్రపోజ్ చేయడంతో ఓకే చెప్పాడు. దేశీ స్టైల్‌లో జరిగిన వివాహ వేడుకల్లో మెహందీ, హల్దీ ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇక షేర్వాణీలు ధరించి అందంగా ముస్తాబైన జంట.. ఒక్కటయ్యే క్షణంలో భావోద్వేగంతో ఏడ్చారు. పోలండ్‌లో స్వలింగ వివాహం గురించి ఆలోచించడం అసాధ్యమన్న ప్రణయ్.. తమ పెళ్లి ఇక్కడ జరగడంతో స్నేహితులు, కుటుంబాలు మాకు మద్ధుతుగా నిలుస్తున్నాయని అన్నాడు.






