- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రాక్షస డాక్టర్లే.. నా తండ్రిని హత్య చేశారు!
<p>దిశ, సినిమా: డాక్టర్లే తన తండ్రిని హత్య చేశారని ఫైర్ అయింది యాక్ట్రెస్ సంభావనా సేత్. ఈ నెల ప్రారంభంలో తండ్రిని కోల్పోయిన ఆమె.. మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే ఆయన మరణించారని ఆరోపించింది. తన తండ్రి చనిపోయిన రోజున ఆస్పత్రిలో రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. హాస్పిటల్‌కు లాయర్ ద్వారా నోటీసులు పంపించి లీగల్‌గా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నానని తెలిపింది. ఆస్పత్రిలో నర్సులు తమతో తప్పుగా ప్రవర్తించారని, తన తండ్రి ఆక్సిజన్ […]</p>

దిశ, సినిమా: డాక్టర్లే తన తండ్రిని హత్య చేశారని ఫైర్ అయింది యాక్ట్రెస్ సంభావనా సేత్. ఈ నెల ప్రారంభంలో తండ్రిని కోల్పోయిన ఆమె.. మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే ఆయన మరణించారని ఆరోపించింది. తన తండ్రి చనిపోయిన రోజున ఆస్పత్రిలో రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. హాస్పిటల్‌కు లాయర్ ద్వారా నోటీసులు పంపించి లీగల్‌గా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నానని తెలిపింది. ఆస్పత్రిలో నర్సులు తమతో తప్పుగా ప్రవర్తించారని, తన తండ్రి ఆక్సిజన్ లెవల్స్ 55 ఉన్నా.. తన ఆక్సిజన్ సాచురేషన్ బాగుందని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందరు డాక్టర్లు దేవుళ్లు కాదని మనలాంటి వారిని చంపేందుకు ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారని బాధపడింది. తండ్రిని కోల్పోవడం జీవితంలో తాను ఎదుర్కొన్న అతిపెద్ద కష్టమన్న ఆమె.. తన తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతానని తెలిపింది. ఈ పోరాటంలో తాను గెలవచ్చు, ఓడిపోవచ్చు కానీ కచ్చితంగా వారిని బయటకు లాగుతానని స్పష్టం చేసింది.






