- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి దయాహృదయాన్ని చాటుకున్న సమంత
<p>దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి అందరి మెప్పు పొందడమే కాదు, నిజజీవితంలోనూ సమాజానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తుంటారు సమంత. అంతేకాదు.. అందరినీ మంచి హృదయంతో అక్కున చేర్చుకోవడంలో సమంత తర్వాతే ఎవరైనా. అదే క్రమంలో సమంత మరోసారి తన దయాహృదయాన్ని చాటుకున్నారు. ఆమె అసిస్టెంట్ ఆర్యన్ కొత్తగా ఒక రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. ఆ ప్రారంభ వేడుకకు సమంత ప్రధాన అతిథిగా వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి అక్కడున్న అందరితో పలకరింపుగా మాట్లాడుతూ […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి అందరి మెప్పు పొందడమే కాదు, నిజజీవితంలోనూ సమాజానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తుంటారు సమంత. అంతేకాదు.. అందరినీ మంచి హృదయంతో అక్కున చేర్చుకోవడంలో సమంత తర్వాతే ఎవరైనా. అదే క్రమంలో సమంత మరోసారి తన దయాహృదయాన్ని చాటుకున్నారు. ఆమె అసిస్టెంట్ ఆర్యన్ కొత్తగా ఒక రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. ఆ ప్రారంభ వేడుకకు సమంత ప్రధాన అతిథిగా వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి అక్కడున్న అందరితో పలకరింపుగా మాట్లాడుతూ తన విలువైన సమయాన్ని గడిపారు.
పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లకే కాదు.. తన వాళ్ల అభివృద్ధి కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని సమంత నిరూపించారు. ఆర్యన్ చాలా కష్టశీలి అని, తన దగ్గర 11 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని సమంత తెలిపారు. తను ఇలా ఒక బిజినెస్ పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గతంలో కూడా సమంత మేనేజర్ మహేంద్ర కూడా సినీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.
tags: Samantha, Aryan, Assistant, Movies, Restaurant, Business, Help






