విడాకుల తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ.. అది తప్ప అన్నీ మాట్లాడేసింది

by  |
Samantha-1
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తొలిసారి ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడిన ఆమె.. రొటీన్ రోల్స్ కాకుండా ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్స్ చేయాలనుకున్నానని, ఈ క్రమంలో వచ్చిన చాన్స్‌ను యూజ్ చేసుకోవాలనుకున్నానని తెలిపింది. కానీ, సిరీస్ షూటింగ్ తర్వాత చాలా అడ్డంకులు ఎదురయ్యాయని.. ఫైనల్‌గా రిలీజ్ అయ్యాక బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నానని వివరించింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో పాత్ర రాజీ క్యారెక్టర్‌ కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానని తెలిపింది. ఈ మూవీలో ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుందని.. తనను తాను చూసుకుని ఇంత అందంగా ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని చెప్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హపై పొగడ్తల వర్షం కురిపించిన సామ్.. ఫ్యూచర్‌లో ఆమె ఇండస్ట్రీని ఏలడం ఖాయమని తెలిపింది. తను పుట్టడమే రాక్ స్టార్‌గా పుట్టిందని… శాకుంతలం రిలీజ్ అయ్యాక తన యాక్టింగ్ చూసి మీరు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తారని తెలిపింది. ఇక ఇంటర్వ్యూలో అక్కినేని ఫ్యామిలీ, చైతుతో విడాకుల గురించి ఏం మాట్లాడని సామ్… ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై స్పెషల్ కాన్సంట్రేషన్ చేస్తున్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed