‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సామ్ లుక్ చూశారా?

by  |
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సామ్ లుక్ చూశారా?
X

దిశ, సినిమా : అక్కినేని వారి కోడలు సమంత బర్త్ డే ఈ రోజు(బుధవారం). ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘ఏ మాయ చేశావే’ నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న సామ్.. ఇప్పుడు మరింత కొత్తగా ట్రై చేసేందుకు సిద్ధమైంది. గ్లామరస్ రోల్స్, పాజిటివ్ షేడ్స్ ఉన్న ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన సామ్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా నెగెటివ్ రోల్‌లో కనిపించబోతోంది.

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా వస్తున్న సిరీస్ ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. సామ్ నెగెటివ్ షేడ్స్‌ను ఆస్వాదించే అవకాశం అభిమానులకు దక్కలేదు. ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో ‘రాజీ’గా కనిపించబోతోన్న సామ్ లుక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. వారితో కలిసి ఉన్న సామ్ బిహైండ్ ది సీన్స్ పిక్చర్ షేర్ చేస్తూ విష్ చేశారు. రాజీ వరల్డ్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తామని తెలిపారు. కాగా ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed