Samantha : ‘సూపర్ హీరోస్‌’ కోసం ఎదురు చూస్తున్నానంటున్న సమంత..

by  |
Samantha
X

దిశ, వె‌బ్‌డెస్క్ : మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరో విజువల్ వండర్ ‘ఎటర్నల్స్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 5న థియేటర్ల ముందుకు రాబోతుంది. ‘అవెంజర్స్’ వంటి భారీ హిట్ చిత్రాలను అందించిన మార్వెల్ స్టూడియోస్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది. దీపావళి కానుకగా ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హీరోస్‌ను పరిచయం చేసిన ఘనత మార్వెల్ స్టూడియోస్‌కు దక్కుతుంది. గతంలో హల్క్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ పార్ట్-1,2 ఇలా చాలా సినిమాలు ఈ ప్రొడక్షన్‌లోనే వచ్చాయి.

తాజాగా వచ్చిన ఎటర్నల్స్ మూవీలో మొత్తంగా 10 మంది సూపర్ హీరోస్ ఉన్నారని.. వీరంతా అద్భుతమైన శక్తులతో పోరాడనున్నారని, మానవత్వం కలిగిన అమాయకులను రక్షించడమే వీరి పనిగా తెలుస్తోంది. పండుగ టైంలో వస్తున్న ఈ సినిమా మంచి ఎంటర్ టైన్‌మెంట్ను అందిస్తుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో ప్రముఖ నటి ఏంజెలీనా జోలీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మాణంలో గతేడాది ‘నోమద్ ల్యాండ్’ ఈ సినిమాతో ‘అకాడమీ అవార్డు’ గెలుచుకున్న ‘క్లో ఝా’ ఎటర్నల్స్ మూవీకి దర్శకత్వం వహించారు.

అయితే, ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా నటి సమంత దీనిపై స్పందించింది. ఎటర్నల్స్ మూవీ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. ‘మనందరం సూపర్ హీరోలను ఎంత గానో ఇష్టపడుతుంటాం.. ఇప్పుడు వాళ్లంతా కొత్త రూపంలో మన ముందుకు రానున్నారని పేర్కొంది. సూపర్ హీరోస్‌ను స్క్రీన్ పై చూసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చింది సామ్..

ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి: డైరెక్టర్ రాజమౌళి



Next Story

Most Viewed