బన్నీ కామెంట్స్‌పై సమంత రియాక్షన్ ఇదే..

by  |
బన్నీ కామెంట్స్‌పై సమంత రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తన స్నేహితులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న సమంత తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు స్పందించింది. నేను మిమ్ముల్ని ఎప్పుడూ నమ్ముతాను అల్లు అర్జున్ అంటూ సామ్ ట్వీట్ చేసింది. అయితే మంగళవారం రోజు జరిగిన పుష్ప థాంక్యూ మీటింగ్‌లో సమంతపై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఊ.. అంటావా.. ఊఊ అంటావా సాంగ్ ఉండటంతో సమంతకు అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు.

మీరు ఈ సాంగ్ చేసినందకు థాంక్యూ సామ్.. ఈ సాంగ్‌ను మీరెంతనమ్మారో తెలియదు కానీ.. మా మీద నమ్మకంతో చేశారు చూడు ఆ నమ్మకానికి ధన్యవాదాలు. కానీ నాకు తెలుసు ఈ సాంగ్ చేయడానికి మీకు ఎన్ని సందేహాలు వచ్చాయో.. కానీ నన్ను నమ్మండి చేయండి అని చెప్పాను. ఆ తర్వాత మీరు నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఏదీ అడిగినా మరో మాట లేకుండా చెప్పింది, చెప్పినట్టు చేశారు. దీంతో మీరు నామనస్సును, గౌరవాన్ని గెలుచుకున్నారన్నారు. అలాగే యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో ఊ అంటావా.. సాంగ్ నెంబర్ వన్ స్థానంలో ఉండటం మాములు విషయం కాదు. ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటే వేరే ఆప్షన్ లేకుండా అందరూ చచ్చినట్టు ఊ అనాల్సిందే, అనే రేంజ్‌లో సాంగ్ ఉందన్నారు.

Read more: ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు లోనయ్యా : ఎన్టీఆర్


Next Story

Most Viewed