No Entry: ఆ సినిమాలో సమంతకు, రష్మికకు నో ఎంట్రీ ?

by Dishanational2 |
Samantha Ruth Prabhu and rashmika Mandanna are to appear in Salman Khan
X

దిశ, వెబ్‌డెస్క్ : Samantha Ruth Prabhu and Rashmika Mandanna are to appear in Salman Khan's No Entry?| సమంత, రష్మిక ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపడం లేదన్న విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాలో వీరి నటన అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఊ అంటావా సాంగ్‌తో సమంత, హీరోయిన్‌గా రష్మిక బెస్ట్ పరఫామెన్స్ ఇచ్చారు అనడంలో అతిశయోక్తిలేదు. కాగా బాలీవుడ్ స్టార్ హీరో ఈ విషయాన్ని గుర్తించి వారిద్దరిని ఒకే ఫ్రేంలో చూడాలనుకుంటున్నారంట.

హీరో సల్మాన్ ఖాన్ తన సూపర్ హిట్ మూవీ నో ఎంట్రీ‌ సీక్వెల్‌తో త్వరలో రాబోతున్నాడు. దీనికి నో ఎంట్రీ 2 అనే టైటిల్ కూడా ఖారారైంది. అయితే ఈ సినిమా కోసం దక్షిణాది నుండి పెద్ద స్టార్‌లెట్‌ల కోసం ఈ నటుడు ఎదురు చూస్తున్నాడని సమాచారం. దీని ద్వారా సినిమా మార్కెట్‌ను సులభంగా భారత దేశం మొత్తం విస్తరించవచ్చని ఆయన ఆలోచిస్తున్నాడంట. అందుకోసమే స్టార్‌ల కోసం ఈ హీరో సెర్చ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, తమన్నా కూడా జాయిన్ అవుతారని, అలాగే అనిల్ కపూర్ సరసన మిల్కీ సైరన్ కనిపించనుందని వారు అంటున్నారు. ప్రస్తుతం భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హాస్యభరిత చిత్రంలో దాదాపు 10 మంది హీరోయిన్లకు స్థానం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాలోనే రష్మిక, సమంత తీసుకరావాలని ఆలోచిస్తున్నా.. వారు దీనిపై ఆసక్తిచూపుక పోవడంతో ఈ చిత్రంలోకి వారు ఎంట్రీ ఇవ్వలేరంటూ కొందరు ముచ్చటిస్తున్నారు.

Next Story

Most Viewed