విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి

by  |
samantha
X

దిశ, సినిమా : ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతను ఫాలోఅయ్యే వారికి ‘వాట్ మమ్మీ సెడ్’ పేరుతో తను పోస్ట్ చేసే కోట్స్ గురించి తెలిసే ఉంటుంది. జీవిత పాఠాలకు సంబంధించిన అనేక ఇన్‌స్పైరింగ్ కొటేషన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి ఇలాంటి లైఫ్ లెస్సన్స్‌ను రెగ్యులర్‌గా పంచుకుంటున్న సామ్.. ఈ రకంగా తల్లికి ధన్యవాదాలు చెప్తోంది. అయితే డైవోర్స్ తర్వాత తన జీవితాన్ని గాడిలో పెట్టేందుకు సమంత తల్లి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కూతురిలో ధైర్యాన్ని నింపే వాక్యాలను పంపిస్తుండగా.. వాట్సాప్‌లో పంపిన అలాంటి ఓ కోట్‌ను సమంత ఈ రోజు షేర్ చేసింది.

‘ముక్కలైన జీవితాన్ని తిరిగి అందంగా మార్చుకోగలననే విషయం నీకు తెలియదు’ అనే అర్థాన్నిస్తున్న ఆ మాటలు స్ట్రాంగ్ ఉమన్‌‌గా లైఫ్ లీడ్ చేస్తున్న సమంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దీంతో పాటు పర్సనల్ నోట్ చేసిన సామ్ తల్లి.. ‘గాడ్ బ్లెస్ యు మై బేబీ’ అంటూ కిస్ అండ్ హార్ట్ ఎమోజీలతో కూతురిపై ప్రేమను చాటుకుంది.


Next Story

Most Viewed