సమంత- చైతన్య విడాకులు.. స్పందించిన అక్కినేని కోడలు

by  |
సమంత- చైతన్య విడాకులు.. స్పందించిన అక్కినేని కోడలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని కోడలు సమంత – నాగ చైతన్య జంట హాట్ టాపిక్ గా మారారు. గత కొన్ని రోజుల నుంచి సామ్- చై విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇలా నెటిజన్స్ అనుకోవడానికి కారణం లేకపోలేదు. పెళ్లి తర్వాత తన పేరు వెనక అక్కినేనిని జోడించుకున్న సామ్ ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని ఎస్ అనే సింగిల్ వర్డ్ కి మార్చేసింది. అప్పటినుంచి మొదలైన ఈ పుకార్ల వర్షం ఇటీవల నాగార్జున బర్త్ డే రోజు నాగ్ ని మామ అని పిలవడంతో ఆగిపోయాయి అని అనుకున్నారు. కానీ, ఆ తరువాత కూడా ఈ రూమర్స్ కి చెక్ పడింది లేదు. ఎందుకంటే నాగ్ బర్త్ డే పార్టీలో సామ్ కనిపించకపోవడమే.. మామ బర్త్ డే పార్టీని వదిలి మరీ సామ్ వెకేషన్ కి వెళ్లిందంటే కొంత అనుమానంగానే ఉందంటూ నెటిజన్లు చెవులు కోరుకుంటున్నారు. ఇక వీటిపై అక్కినేని ఫ్యామిలీ కానీ, సామ్ కానీ స్పందించకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారయ్యింది.

Read more :

బాంబ్ పేల్చిన వర్మ.. ఆ ఫొటోతో పవన్ కళ్యాణ్‌కి విషెస్

ఇకపొతే సామ్ ఈ పుకార్లపై డైరెక్ట్ గా స్పందించకుండా ఇన్ డైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో తాజాగా ఒక పిక్ ని పోస్ట్ చేసిన సామ్.. అందులో మీడియా, రియాలిటీ మ‌ధ్య వ్య‌త్యాసాన్ని చూపించింది. గోరంత విషయం జరిగితే మీడియా కొండంత చేసి చూపిస్తున్నట్లు అర్ధం వచ్చేలా ఆ ఫోటో ఉండడంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మేము బాగానే ఉన్నాం.. మీరే పుకార్లను రేపుతున్నారు అన్న‌ట్టుగా నెటిజన్లకు చురకలు వేసింది. దీంతో సామ్-చై కలిసే ఉన్నారని అర్ధమవుతుంది. రోజులు గడిచేకొద్దీ సామ్ -చైతన్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న పుకార్లు మరింత తీవ్ర తరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న ఈ జంట 4వ వివాహ వార్షికోత్సవం జరగనుంది. మరి ఆరోజైన తమ బంధం గురించి ఓపెన్ అయ్యి ఈ పుకార్లకు చెక్ పెడతారేమో చూడాలి.

Samantha Akkineni: సమంత- చైతన్య విడాకులు.. పుకార్లను వదిలి ఫ్రెండ్ తో షికార్లు చేస్తోందిగా..?



Next Story

Most Viewed