సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సామ్

by  |
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సామ్
X

అక్కినేని కోడలు సమంత వెండితెరపై సత్తా చాటుతోంది. పెళ్లి తర్వాత సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది. మజిలీ, ఓ బేబి లాంటి సినిమాల్లో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసిన సామ్.. జాను సినిమాతో హార్ట్ టచింగ్ మూవీని అందించింది.

అయితే వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న సామ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. మరో రెండు మూడు ఏళ్లు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేసి తర్వాత లైమ్ లైట్ కు దూరంగా ఉంటానని చెప్తోంది. తర్వాత పూర్తిగా కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. జాను ప్రమోషన్స్ లో సామ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. మంచి ఫాంలో ఉన్న టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం బాధగా ఉందంటున్నారు. ఇప్పుడే రిటైర్మెంట్ వద్దని కోరుతున్నారు.

కాగా శుక్రవారం విడుదలైన జాను మూవీపై ప్రశంసలు అందుకుంటోంది సామ్. జాను క్యారెక్టర్ లో ఒదిగిపోయిందని… అమేజింగ్ గా యాక్ట్ చేసిందని చెబుతున్నారు. సినిమాలో ప్రతీ సన్నివేశం గుండెను బరువెక్కించిందని… విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Next Story

Most Viewed