- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నా.. నీ దరిద్రం వదిలిపోయింది.. చై-సామ్ విడాకులపై ఫ్యాన్స్ రియాక్షన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: అభిమానులు ఏదైతే నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. నాలుగేళ్ల క్రితం ఎంతో ప్రేమించి ఒక్కటైనా ప్రేమ జంట విడిపోయింది. అక్కినేని ఇంటి కోడలిగా, నాగ చైతన్య భార్యగా సామ్ అడుగుపెట్టి ఈ అక్టోబర్ 7 కి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వారి నుంచి గుడ్ న్యూస్ ఆశించిన అభిమానులకు ఆ జంట బాడ్ న్యూస్ ని అందించారు. కొన్నినెలలుగా అభిమానుల మనస్సులో అనుమానంగా మిగిలిన విడాకుల విషయాన్ని నిజం చేస్తూ తమ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అభిమానులు ఏదైతే నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. నాలుగేళ్ల క్రితం ఎంతో ప్రేమించి ఒక్కటైనా ప్రేమ జంట విడిపోయింది. అక్కినేని ఇంటి కోడలిగా, నాగ చైతన్య భార్యగా సామ్ అడుగుపెట్టి ఈ అక్టోబర్ 7 కి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వారి నుంచి గుడ్ న్యూస్ ఆశించిన అభిమానులకు ఆ జంట బాడ్ న్యూస్ ని అందించారు. కొన్నినెలలుగా అభిమానుల మనస్సులో అనుమానంగా మిగిలిన విడాకుల విషయాన్ని నిజం చేస్తూ తమ వివాహ బంధాన్ని ముగించారు. సోషల్ మీడియా వేదికగా చై ఈ విషయాన్ని తెలిపారు. దీంతో అభిమానులు చైతూ కి మద్దతు తెలుపుతున్నారు.
సామ్ నుంచి విడిపోవడంబాధగా ఉందని కొందరు చెప్తుంటే.. ఇంకొందరు మాత్రం బాధపడకు బ్రో.. నీకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “ఏ మాయ చేసేసావే” సినిమాతో పట్టిన దరిద్రం లవ్ స్టోరీ తో వదిలింది అనుకుంటున్న ఆ దరిద్రం ఏంటో అర్ధం అయ్యి ఉంటుంది.. అని ఒక నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు చేయగా.. మరో నెటిజన్ ఏం పర్లేదు.. ఇప్పటినుంచి నీకు మంచి జీవితం మొదలయ్యింది అంటూ కామన్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.






