రూట్ మార్చిన సమంత.. విడాకుల తర్వాత షాకింగ్ డెసిషన్

by  |
రూట్ మార్చిన సమంత.. విడాకుల తర్వాత షాకింగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏమాయ చేసావే సినిమాతో కుర్రకారు మతి పోగొట్టిన ముద్దుగుమ్మ సమంత. తన అందం అభినయంతో మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల మనసు దోచేసుకుంది. తర్వాత వరస హిట్‌లతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగచైతన్యతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసినా.. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది.

ఇక తాజాగా చైతూతో విడాకులు తీసుకుటున్నానని ప్రకటించిన తర్వాత సమంత రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సామ్ ఒప్పుకున్నట్లు సమాచారం. s/o సత్యమూర్తి సినిమాలో అల్లుఅర్జున్ సరసన ఆడిపాడిన ఈ అమ్మడు ఇప్పుడు పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన ఐటమ్ సాంగ్‌లో మెరవనుందని టాక్. అంతే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో సమంత హిరోయిన్‌గా చేసింది. సమంతకు సుకుమార్ అంటే గౌరవం కూడా అందువల్లనే పుష్పలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ ఉండబోతుందని సినీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా సమంత విడాకుల తర్వాత మళ్ళీ తన పాత రూట్లోకి వచ్చేసి వరుస సినిమాలతో, ఇలా ఐటెం సాంగ్స్ తో అభిమానులని అలరించబోతుందని అర్ధమవుతుంది.


Next Story

Most Viewed