దూసుకెళ్తోన్న సమంత.. మరో అరుదైన రికార్డ్

808

దిశ, వెబ్‌డెస్క్ : విడాకుల అనంతరం సమంత తన కెరియర్ పై దృష్టి సారించింది. వరస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్పా సినిమాలో ఇప్పటికే ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. అంతే కాకుండా సామ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు  సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. ఇక తన అభిమానులకు సామ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన ఇన్ స్టాగ్రాంలో సామ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇన్ స్టా‌లో తన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లు దాటిందని ఫొటో షేర్ చేస్తూ సామ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ్యాక్స్ అంటూ ఫొటోను షేర్ చేసింది.