‘పుష్ప’ ఐటం సాంగ్.. ఊర మాస్‌ లుక్‌లో సమంత

by  |
‘పుష్ప’ ఐటం సాంగ్.. ఊర మాస్‌ లుక్‌లో సమంత
X

దిశ, సినిమా: సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో సమంత ఐటమ్ సాంగ్ చేస్తు్న్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన మూవీ టీమ్.. తాజాగా సమంత బ్యాక్ లుక్‌‌తో కూడిన పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఈ సాంగ్‌ను ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా పేర్కొన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఇందుకోసం సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌లో బ్యాక్‌సైడ్ మాత్రమే కనిపిస్తున్న సమంత.. మ్యూజిక్ మొదలైతే స్టెప్పు వేయడమే ఆలస్యం అన్నట్లు స్టిల్‌ ఇచ్చింది. ఈ స్పెషల్ సాంగ్‌కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా.. సామ్ ఈ ఒక్క పాట కోసమే రూ. 1.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు సుకుమార్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించగా, డిసెంబర్ 17న విడుదల కానుంది.

Read more : విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి

బిగ్‌న్యూస్.. IPLలో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు BAN..?


Next Story