బిగ్‌న్యూస్.. IPLలో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు BAN..?

by  |
బిగ్‌న్యూస్.. IPLలో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లు BAN..?
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు ఏడాది పాటు ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ బ్యాన్ విధించనున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఖాన్ ఆడుతున్నారు. వీరిద్దరూ ఆయా ఫ్రాంచైజీల కాంట్రాక్టులో ఉన్న సమయంలోనే ఇతర జట్లతో బేరసారాలు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. లక్నో జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆ రెండు ఫ్రాంచైజీలు బీసీసీఐకి మాట ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో లక్నో జట్టు యాజమాన్యం ఆర్పీ గోయెంకా గ్రూప్‌పై విచారణ చేపట్టినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో ఇద్దరు ఆటగాళ్లు ప్రలోభాలకు గురయ్యారా లేదా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నది. కేఎల్ రాహుల్‌కు పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రూ. 11 కోట్లు చెల్లిస్తుండగా లక్నో యాజమాన్యం రూ. 20 కోట్లకు పైగా ఆశ చూపినట్లు తెలుస్తున్నది. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రషీద్ ఖాన్‌కు రూ. 8.9 కోట్లు చెల్లిస్తున్నది. అయితే అతడికి దాదాపు రూ. 16 కోట్ల వేతనం ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు సమాచారం. ఐపీఎల్‌లో ఏ ఆటగాడైనా ఒక ఫ్రాంచైజీ కాంట్రాక్టులో ఉన్న సమయంలో ఇతర జట్లతో బేరసారాలు సాగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2010లో సీఎస్కేతో కాంట్రాక్టు ఉన్న సమయంలోనే రాజస్థాన్ రాయల్స్‌తో బేరసారాలు సాగించాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో జడేజా ఒక ఏడాది పాటు ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ వేటు వేసింది. ఇప్పుడు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై కూడా ఏడాది పాటు బ్యాన్ పడే అవకాశం ఉన్నది. దీంతో ఆయా జట్లు విడుదల చేసినా వారిద్దరూ వేలం పాటలోకి వచ్చే అవకాశం ఉండదు.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్ రహానే‌పై వేటు..?


Next Story

Most Viewed