- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామ్ ‘ఇషా క్రియ’ షురూ..
<p>అక్కినేని కోడలు సమంత పర్‌ఫెక్ట్ ఇల్లాలుగా మారిపోయింది. ఇంటి పనులను తానే చక్కదిద్దుతూ బిజీ బిజీగా గడిపేస్తుంది. లాక్‌డౌన్‌లో కొత్తగా గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసిన సామ్.. జూన్ 21న ‘యోగా డే’ పురస్కరించుకుని ఓ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి 48 రోజుల ‘ఇషా క్రియ’ ప్రయాణం ప్రారంభించినట్లు వెల్లడించింది. అంతేకాదు ఇషా క్రియ.. ఆరోగ్యం, శ్రేయస్సును అందిస్తుందని చెప్తూ.. తన ప్రయాణంలో భాగం కావచ్చని అభిమానులను కూడా పిలుపునిస్తోంది. ఇషా క్రియ ఒక శక్తివంతమైన […]</p>

అక్కినేని కోడలు సమంత పర్‌ఫెక్ట్ ఇల్లాలుగా మారిపోయింది. ఇంటి పనులను తానే చక్కదిద్దుతూ బిజీ బిజీగా గడిపేస్తుంది. లాక్‌డౌన్‌లో కొత్తగా గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసిన సామ్.. జూన్ 21న ‘యోగా డే’ పురస్కరించుకుని ఓ నిర్ణయం తీసుకుంది.
మంగళవారం నుంచి 48 రోజుల ‘ఇషా క్రియ’ ప్రయాణం ప్రారంభించినట్లు వెల్లడించింది. అంతేకాదు ఇషా క్రియ.. ఆరోగ్యం, శ్రేయస్సును అందిస్తుందని చెప్తూ.. తన ప్రయాణంలో భాగం కావచ్చని అభిమానులను కూడా పిలుపునిస్తోంది. ఇషా క్రియ ఒక శక్తివంతమైన సాధనం అని.. మన జీవితాన్ని పూర్తి సామర్థ్యంతో గడిపేందుకు సహకరిస్తుందని చెప్పింది. సామ్‌తో పాటు తన కుట్టి కుక్క పిల్ల హాష్ కూడా ధ్యానంలో మునిగిపోయిన పిక్.. చాలా క్యూట్‌గా ఉందని చెప్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram
A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Jun 22, 2020 at 9:55pm PDT
కాగా, సమంత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు ‘ది ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న సామ్.. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుందట.






