మరో సిరీస్‌లో సామ్.. నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునరేషన్

by  |
samantha netflix
X

దిశ, సినిమా : సమంత అక్కినేని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్, కాంట్రవర్సీలతో ప్రతీరోజు వార్తల్లో నిలుస్తోంది. సిరీస్‌లో రాజీ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన సామ్.. ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేము అన్నట్లుగా నటించింది.

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారి కోడలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోగా.. నెట్‌ఫ్లిక్స్ తన టాలెంట్‌ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ట్రైలింగువల్ సిరీస్‌ కోసం వెరైటీ కాన్సెప్ట్‌తో సామ్‌ను కలిసినట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్ నెరేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందని ఇండస్ట్రీ టాక్.

Next Story