జామ్ జామ్‌గా ‘చై – సామ్’

by  |
జామ్ జామ్‌గా ‘చై – సామ్’
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ షో సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతుండగా, వ్యూస్ పరంగానూ మంచి పేరొచ్చింది. ఇటీవల మెగాస్టార్‌తో చేసిన మెగా షో.. హైలెట్‌గా నిలవగా, ఫస్ట్ సీజన్‌కు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు యంగ్ హీరో నాగచైతన్యను గెస్ట్‌గా ఆహ్వానించారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. చై సామ్ అభిమానులను అది ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా సామ్ జామ్‌లో సామ్ చేస్తున్న అల్లరి మామూలుగా లేకపోగా, తాజా ప్రోమోలో తన భర్తతో చేసిన అల్లరి అంతకు డబుల్ ఉంది. అంతేకాదు.. ప్రతి ఎపిసో‌డ్‌లో అతిథుల సీక్రెట్స్ బయటకు తెప్పించేందుకు ప్రయత్నించిన సామ్.. ఈ సారి మాత్రం చైతు తన సీక్రెట్స్‌ ఎక్కడ రివీల్ చేస్తాడోనని భయపడుతోంది.

‘ఫైనల్లీ యు ఆర్ ఆన్ ద సామ్ జామ్ స్టేజ్’ అని సామ్ అనడంతోనే.. ‘ఈడు ఇంట్లోనే పడి ఉంటాడుగా, ఎపుడైనా వస్తాడులే అని లాస్ట్‌లో నన్ను పిలిచావ్’ అంటూ చై పేల్చిన పంచ్ షోలో నవ్వులు పూయించింది. అంతేకాదు ప్రోమో చూస్తే.. షో మొత్తం కూడా చై-సామ్ పంచ్‌లతో‌‌నే సాగిపోయినట్లుగా తెలిసిపోతోంది. ‘ఇంట్లో అడ్వైజ్ ఇస్తే తీసుకోవు కానీ ఇక్కడ మాత్రం తీసుకుంటావా? కుకింగ్, క్లీనింగ్‌కు మార్కులు ఇవ్వాలా? షోలో ఈ గెస్ట్‌ను మాత్రం ర్యాగ్ చేయలేవు, ఎందుకంటే ఈ గెస్ట్‌కు నీ గురించి అన్నీ తెలుసు’ అంటూ చై పేల్చిన పంచ్‌ల‌తో ప్రోమోను ఇంటరెస్టింగ్‌గా డిజైన్ చేశారు. భర్తతో సామ్ చేసిన సందడి, వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూస్తే.. అక్కినేని అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్‌కు కూడా ‘సామ్ జామ్’లో నాగ చైతన్య ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా! అనిపిస్తుంది. ఇవేకాక, చైతన్య నుంచి సామ్ ఇంకెలాంటి సీక్రెట్స్ బయటపెట్టిస్తుందో తెలియాలంటే షో వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


Next Story

Most Viewed