ఆ నటి వెరీ హాట్ :Samantha

by  |
ఆ నటి వెరీ హాట్ :Samantha
X

దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత (Samantha Akkineni) తాజాగా ప్రకటించిన టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో అత్యుత్తమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో తను ఎంపికైనందుకు నటిగా సంతోషపడిన సామ్, ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్యూలో తోటి కథానాయికలపై ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. అంతేకాదు ఇండస్ట్రీలో తనకు నచ్చే ఐదుగురి పేర్లను రివీల్ చేసింది. ఇంతకీ అక్కినేని కోడలు చేసిన కామెంట్స్ ఏంటి? ఆమె దృష్టిలో ఉత్తమ నాయిక ఎవరు? అందాల అప్సరస ఎవరు?

సౌత్ ఇండియా అందాల తార ‘నయనతార’ (Nayanatahara) చాలా హాట్ అంటూ సమంత సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చింది. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతు వాకులా రేండు కాదల్’ మూవీలో నయన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయన్ నటనకే కాకుండా అందానికి కూడా ఫిదా అయిపోయింది. గతంలో కూడా ఓ సందర్భాల్లో, సమంత ఈ చంద్రముఖి పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసింది. ఇక సాయి పల్లవి ది బెస్ట్ నటి అని తనంటే చాలా ఇష్టమని చెప్పిన సామ్, బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని ప్రశంసలు కురిపించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమంత తనకు హిందీలో దీపికా పదుకొనే, అలియా భట్‌లు ఇష్టమని చెప్పింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుండగా, ఆ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎల్.టి.టి.ఇ రెబల్ పాత్రలో సమంత నటించిన సంగతి తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed