కూకట్ పల్లిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సందడి

91

దిశ, కూకట్ పల్లి: కూకట్ పల్లిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సందడి చేశారు. కూకట్ పల్లి సుజన ఫోరం మాల్ లో అంతిమ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ మళ్లీ వస్తానని, అభిమానులను కలుస్తానని అన్నారు. హైదరాబాద్ తనకు ఇష్టమైన ప్రదేశమని, నగరానికి రాగానే హైదరాబాద్ బిర్యానీ తిన్నట్లు చెప్పారు. అంతిమ్ సినిమా అందరినీ మెప్పిస్తుందని అన్నారు. హైదరాబాద్ మళ్లీ షూటింగ్ కు వచ్చినప్పుడు అభిమానులను కలుస్తానని అన్నారు. సల్మాన్ ఖాన్ ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.