హాలీవుడ్ స్టైల్‌లో సల్లూభాయ్ ‘రాధే’ రిలీజ్.. ఎప్పుడంటే?

by  |
హాలీవుడ్ స్టైల్‌లో సల్లూభాయ్ ‘రాధే’ రిలీజ్.. ఎప్పుడంటే?
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే నెల 13న రంజాన్ పురస్కరించుకుని థియేటర్స్, ఓటీటీ రిలీజ్ ఒకేసారి ఉంటుందని స్పష్టం చేశారు మేకర్స్. ఇంటర్నేషనల్ స్టూడియో, వార్నర్ బ్రదర్స్ లాంటి బ్యానర్స్ వండర్ ఉమన్, కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా సినిమాలను ఒకేసారి అటు థియేటర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయగా వారినే ఫాలో అయిపోయారు ‘రాధే’ మేకర్స్. ఇలా ఇండియాలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా సల్లూ భాయ్‌దే కావడం విశేషం.

మొత్తానికి ప్రామిస్ చేసినట్లు ‘రాధే’ను థియేటర్స్‌లోకే తీసుకొస్తున్న సల్మాన్.. సినిమా 40 దేశాల్లో పే పర్ వ్యూ మోడల్ రూపంలో రిలీజ్ అవుతుంతుందని, ఇండియా, యూకే, యూఏఈ, యూఎస్ లాంటి దేశాల్లో సినిమా హాల్స్‌లో విడుదల కానుందని తెలిపారు. ఈ నెల 22న ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటికే సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ప్రభుదేవా డైరెక్టర్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, సోహెల్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

https://twitter.com/SohailKhan/status/1384793422792314880?s=20



Next Story

Most Viewed