సల్మాన్ ఖాన్ గాంధీగిరి.. బ్రహ్మచారిగా ఎక్స్‌పరిమెంట్స్?

by  |
salman khan
X

దిశ, సినిమా : ముప్పై ఏళ్ల నుంచి సినిమాలే శ్వాసగా బతికిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌.. ఈ మధ్య ఇతర వ్యాపకాలపైకి దృష్టి మరల్చాడా? సినీ కెరీర్‌ను లైట్ తీసుకుంటున్నాడా? అంటే నిజమే అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో సల్మాన్ ప్రవర్తనలో చోటు చేసుకున్న అనేక మార్పులు ఇదే విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తున్నాయి. సల్మాన్ నటించిన ‘అంతిమ్‌’ మూవీ రీసెంట్‌గా విడుదల కాగా.. అభిమానులు థియేటర్‌లో క్రాకర్స్ కాల్చడంతో పాటు తన పోస్టర్‌కు పాలాభిషేకం చేయడం పట్ల సున్నితంగా మందలించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయొద్దని సూచించారు. దేశంలో ఎంతో మంది నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే, పాలను వృధా చేయడాన్ని తప్పుబట్టారు. ఆ పాలను చిన్నారులకు అందిస్తే సంతోషిస్తానని వెల్లడించారు.

ఇక ‘అంతిమ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అహ్మదాబాద్‌‌కు వెళ్ళిన సల్మాన్.. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ కొద్దిసేపు చరఖాను తిప్పి నూలు వడికారు. ఇదిలా ఉంటే.. సల్మాన్ ఈ మధ్య నేలపైనే పడుకుంటున్నాడని ఆయన బావ ప్రకటించారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న నెటిజన్లు.. సల్లుభాయ్ గాంధీ మార్గంలో నడుస్తున్నాడని అంటున్నారు. చూస్తుంటే సినిమాలు మానేసి, ఏదైనా ఆశ్రమాన్ని స్థాపించడం ద్వారా ప్రజా సేవ చేసేలా ఉన్నాడని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇక గాంధీజీ మాదిరి బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్న సల్మాన్.. సంసార జీవితంలోనూ ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed