పోలీస్ గెటప్‌పై సల్లూ కన్ఫ్యూషన్?

by  |
పోలీస్ గెటప్‌పై సల్లూ కన్ఫ్యూషన్?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్యే ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. జనవరి నుంచి ‘టైగర్ 3’ మూవీ ఫిల్మింగ్ స్టార్ట్ కానుండగా..ఆ లోపు ‘అంతిమ్’ మూవీలో తన పోర్షన్ కంప్లీట్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. మరాఠి ఫిల్మ్ ముల్షి పాటర్న్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో సల్లూ భాయ్ బావ ఆయుష్ శర్మ కూడా నటిస్తున్నారు. అయితే, సల్లూ భాయ్ ప్లాన్‌కు పోలీస్ ఆఫీసర్ గెటప్ అడ్డొస్తుంది. సల్మాన్ ఈ చిత్రంలో సెన్స్ లేని పోలీస్ ఆఫీర్‌గా కనిపించనుండగా గెటప్ ఫైనలైజ్ చేయడంలో కన్ఫ్యూజన్‌తో ఉన్నాడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్.

డైరెక్టర్ స్క్రిప్ట్‌కు తగినట్లుగా మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్ గెటప్ అయితే, బాగుంటుందని అంటుంటే..పంజాబ్ పోలీస్‌గా కనిపిస్తే పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని సల్లూ భాయ్ భావిస్తున్నారట. ఈ విషయంలో చర్చ జరుగుతోంది. నెక్స్ట్ వీక్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందట. బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్‌లో సినిమా లాంచ్ కానుండగా కర్జత్‌లోని ఓ స్టూడియోలో రెండు నెలల షెడ్యూల్ ప్లాన్ చేశారట.



Next Story

Most Viewed