సల్మాన్ ఖాన్ తొలిముద్దు.. ఆ హీరోయిన్‌కే!

by  |
సల్మాన్ ఖాన్ తొలిముద్దు.. ఆ హీరోయిన్‌కే!
X

దిశ, సినిమా : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చివరగా ‘దబాంగ్ 3’లో కనిపించాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాధే’ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు సల్లూభాయ్. వచ్చే నెల 13న ఈ చిత్రం విడుదలవుతుండగా, సల్మాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బీ టౌన్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. గత 33 ఏళ్లుగా ఏ ఒక్క హీరోయిన్‌తోనూ ముద్దు సీన్‌లో నటించలేదు. అయితే ‘రాధే’ ట్రైలర్‌లో దిశా పటానీతో సల్మాన్ లిప్‌లాక్ సీన్ ఉండటం విశేషం. కాగా ఈ సీన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. సల్లూ భాయ్ ‘నో- కిస్ పాలసీ’ బ్రేక్ చేశాడా? అని ప్రశ్నిస్తూ.. కేవలం దిశా పటానీ కోసం ఇలా చేశాడా? అని అడుగుతున్నారు. ఏదేమైనా సల్మాన్ ముద్దు సీన్లకు ఓకే చెప్పడం మంచిదేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సల్మాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.


Next Story