రాజస్థాన్ ఎడారిలో సల్మాన్ సఫారీ

by  |
salman khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు సల్మాన్. ఈ క్రమంలో ‘టైగర్ 3’ షూటింగ్ నుంచి తాజాగా బ్రేక్ తీసుకున్న సల్మాన్.. రాజస్థాన్‌, జైపూర్‌ ఎడారిలో సఫారీకి వెళ్లిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సల్మాన్ నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్, అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ‘టైగర్ 3’ షూటింగ్ ఇటీవలే షురూ అయింది. ఇవేగాక షారుఖ్ ‘పఠాన్’, అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాల్లోనూ సల్లూ భాయ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘రాధే’లో దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మేఘా ఆకాశ్ నటిస్తుండగా, వెర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed