తెలంగాణ బొగ్గు గనుల్లో ‘సలార్’ యాక్షన్

by  |
తెలంగాణ బొగ్గు గనుల్లో ‘సలార్’ యాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వయొలెంట్ ‘సలార్’.. మోస్ట్ వయొలెంట్ యాక్షన్ సీక్వెన్స్‌తోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అది కూడా తెలంగాణ బొగ్గు గనుల్లో కావడం మరో విశేషం. కేజీఎఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నుంచి రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాకు డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. ‘కేజీఎఫ్‌’ను మించిన కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా లాంచింగ్ అయిపోగా..పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో మూవీ షూటింగ్ షురూ కానుంది.

అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న మూవీ యూనిట్ అక్కడికి చేరుకుని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. యాభై మంది ఫైటర్లతో యాక్షన్ సీక్వెన్స్ జరగనుండగా.. ప్రభాస్‌ను, ఆయన సినిమా షూటింగ్‌ను వీక్షించేందుకు చాలా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు స్థానికులు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా..‘సలార్‌’ షూటింగ్ మొదలెట్టేస్తున్నాడు ప్రభాస్. దీంతో పాటు ఇప్పటికే కమిట్ అయిన ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీ అయిపోనున్నాడు.

Next Story

Most Viewed